தெலுங்கானாவில் உள்ள அனைத்து கல்வி நிறுவனங்களிலும் ஒன்றாம் வகுப்பு முதல் 12 ம் வகுப்பு வரை கட்டாயம் தெலுங்கு கற்பிக்க வேண்டும் என தெலுங்கானா அரசு உத்தரவு பிறப்பித்துள்ளது.
டிசம்பர் 15 முதல் 19 ம் தேதி வரை ஐதராபாத்தில் 5 நாட்கள் உலக தெலுங்கு மாநாடு நடைபெற உள்ளது. இது தொடர்பான ஆலோசனை கூட்டத்தில் பேசிய தெலுங்கானா முதல்வர் சந்திரசேகர ராவ், அனைத்து அரசு மற்றும் தனியார் நிறுவன பலகைகளும் தெலுங்கிலேயே வைக்கப்பட வேண்டும். ஒருவேளை அவர்கள் விரும்பினால், தெலுங்குடன் பிற மொழிகளிலும் பலகைகளை வைத்துக் கொள்ளலாம்.
தெலுங்கானாவில் உள்ள அனைத்து கல்வி நிறுவனங்களிலும் ஒன்றாம் வகுப்பு முதல் 12 ம் வகுப்பு வரை கட்டாயம் தெலுங்கு கற்பிக்க வேண்டும். அடுத்த கல்வியாண்டு முதல் இது அமலுக்கு வர உள்ளது. மாணவர்கள் உருது மொழியை விருப்ப பாடமாக தேர்வு செய்து கொள்ள முடியும்.
துவக்க கல்வி முதல் மேல்நிலை கல்வி வரை அனைத்து பாடங்களையும் தெலுங்கில் உருவாக்க சாகித்ய அகாடமிக்கு ரூ.5 கோடி ஒதுக்கீடு செய்யப்பட்டுள்ளது. பாட புத்தகங்களையும் தெலுங்கில் அச்சிட ஏற்பாடு செய்யப்பட்டுள்ளது.
தெலுங்கு கற்பிக்காமல் எந்த ஒரு கல்வி நிறுவனமும் தெலுங்கானாவில் இயங்க முடியாது என கடுமையாக எச்சரித்துள்ளார்.
தெலுங்கானாவில் சில பள்ளிகளில் தெலுங்கிற்கு பதிலாக சிறப்பு ஆங்கிலம் கற்பிக்கப்படுவதாக எழுந்த புகாரை அடுத்து சந்திரசேகர ராவ் இந்த உத்தரவை பிறப்பித்துள்ளார் என கூறப்படுகிறது.
హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అక్టోబర్ నెలలోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. అయితే అక్టోబర్ 5 నుంచి 9వరకు దాదాపు 90 దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రపంచ టూరిజం సదస్సు హైదరాబాద్ లోనే జరుగుతున్నది. నవంబర్ 28 నుంచి దాదాపు 170 దేశాలు పాల్గొనే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు కూడా హైదరాబాద్ వేదిక. ఈ రెండు కార్యక్రమాల్లో అధికార యంత్రాంగమంతా తలమునకలై ఉన్నారు. అదే సమయంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపితే, అనుకున్నంత ఘనంగా నిర్వహించలేమని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఆ రెండు ప్రపంచ సదస్సులు ముగిసిన తర్వాత డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ప్రగతి భవన్లో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్య అకాడమీకి రూ.5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ.2 కోట్లు నిర్వహణ ఖర్చుల కింద మంజూరు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు సాహిత్య అకాడమీ నోడల్ ఏజన్సీగా పనిచేస్తుంది.
ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సలహాదారు శ్రీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ నందిని సిధారెడ్డి, అధికార భాష సంఘం అధ్యక్షుడు శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ, తెలుగు యూనివర్సిటీ విసి శ్రీ సత్యనారాయణ, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి శ్రీ వేణుగోపాల చారి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు భాషను పరిరక్షించే రెండు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి ప్రకటించారు:
1. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో మొదటి తరగతి నుంచి 12వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని సీఎం కేసీఆర్ విద్యా సంస్థలను కోరారు. తెలుగును ఖచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఉర్ధూ కోరుకునే విద్యార్థులకు ఉర్థూ భాషను కూడా ఆప్షనల్ సబ్జెక్టు ఉండాలని నిర్ణయించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ తరగతుల్లో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ రూపకల్పన చేయాల్సిందిగా సాహిత్య అకాడమీని సీఎం ఆదేశించారు. వెంటనే సిలబస్ రూపొందించి, పుస్తకాలు ముద్రించాలని ఆదేశించారు. సాహిత్య అకాడమీ రూపొందించిన సిలబస్ నే అన్ని పాఠశాలల్లో బోధించాలని, ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదని కూడా సీఎం స్పష్టం చేశారు. పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధించడం, సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన సిలబస్ నే బోధించడం విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా, ఖచ్చితంగా వ్యవహరిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
2. తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇకపై తమ బోర్డులను ఖచ్చితంగా తెలుగులో రాయాలని సీఎం పిలుపునిచ్చారు. అన్ని రకాల బోర్డులపై పైన స్పష్టంగా తెలుగులో రాయాలని, ఇతర భాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టమని స్పష్టం చేశారు.
ఈ రెండు నిర్ణయాలకు సంబంధించి త్వరలోనే మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేయాలని సీఎం నిర్ణయించారు.
సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు:
- ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి జరిగిన ప్రయత్నంపై చర్చా గోష్టులు నిర్వహిస్తారు. తెలంగాణలో వర్థిల్లిన తెలుగును ప్రపంచ నలుమూలలకూ తెలిపే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. గోల్కొండ నుంచి వెలువడిన తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేయాలి. తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ మహాసభల్లో ఉంటాయి
- ఎల్.బి. స్టేడియం ప్రధాన వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి. రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కాలేజి గ్రౌండ్స్, భారతీయ విద్యాభవన్, పింగిలి వెంకట్రాంరెడ్డి హాల్, శిల్ప కళావేదిక తదితర వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయి
- ఉదయం సాహిత్య గోష్టులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బతుకమ్మ, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి లాంటి ఆటలు, కలుపుపాట, నాటు పాట, బతుకమ్మ లాంటి పాటలు, వినోద ప్రక్రియలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉంటాయి. తానీషా-రామదాసు సంబంధం, రామదాసు కీర్తనలు, తందనాన రామాయణం, శారదాకారులు, హరికథ ప్రక్రియ తదితర అంశాలను ప్రదర్శించాలి. పద్యగానం, సినీ పాటల విభావరి నిర్వహించాలి. చుక్క పొడుగు నుంచి పొద్దు గూకే వరకు గ్రామీణ ప్రాంతాల్లో పాడుకునే నాట్ల పాటలు, కోత పాటలు, దుక్కి పాటలు, జానపద గేయాలు లాంటి అంశాలు ప్రదర్శించాలి
- వివిధ రకాల నాటక ప్రక్రియలు అంటే ఆదివాసి, గిరిజన, శాస్రీకుయ, జానపద నృత్యాలు లాంటివి ప్రదర్శించాలి
- మహిళలు పాడే పాటలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక తరం నుంచి మరో తరానికి ఎలా అందజేయబడ్డాయో కళ్లకు కట్టినట్లు చూపించాలి
- దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు, కవులు, కళాకారులు, రచయితలు, కళాకారులను ఆ మహాసభలకు ప్రభుత్వం తరుఫున ఆహ్వానించాలి
- దేశ, విదేశాల్లో అతిథులను ఆహ్వానించడానికి, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఔచిత్యం వివరించడానికి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. అమెరికా, యూరప్, గల్ప్ దేశాలతో పాటు మారిషన్, సింగపూర్, మలేసియా లాంటి దేశాల్లో అక్కడున్న తెలుగు వారి కోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ నలుమూలల్లో తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాల్లో కూడా సన్నాహక సమావేశాలు జరుగుతాయి
- కేవలం తెలుగువారినే కాకుండా భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ప్రముఖులను కూడా ఈ మహాసభలకు ఆహ్వానిస్తారు
- ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలుగు భాష ప్రక్రియలకు సంబంధించి పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి
- తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి కృషి చేసిన కవులు, పండితులు, సాహితీ వేత్తలు, కళాకారులను గుర్తించి సన్మానం చేయాలి
- అతిథులందరికీ ప్రభుత్వం తరుఫునే బస, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించాలి
- మహాసభలకు ముందే తెలుగు భాషాభివృద్దికి దోహదపడే పుస్తకాల ముద్రణ జరగాలి
- మహాసభలకు వచ్చిన అతిథులకు నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపించాలి
- అతిథులకు తెలంగాణను పరిచయం చేయడం కోసం తెలంగాణ దర్శిని పేరుతో ప్రత్యేక డాక్యుమెంటరీ తయారు చేయాలి
- తెలంగాణ జీవన చిత్రాన్ని, మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించే బతుకమ్మ నేపథ్యాన్ని వివరించే కళారూపాలు ప్రదర్శించాలి
- నగరంలో డాక్టర్ సి. నారాయణ రెడ్డి స్మారక మందిరం నిర్మించాలి. రెండు మూడు రోజుల్లోనే స్థలం ఎంపిక చేసి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి
- తెలంగాణ సాహిత్య అకాడమీ నోడల్ ఏజన్సీగా పనిచేస్తుంది. అధికార భాషా సంఘం, సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వ విద్యాలయం, గ్రంథాలయ పరిషత్ తదితర సంస్థలు కీలక భూమిక నిర్వహించాలి
- పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయ స్థాయిల్లో వివిధరకాల పోటీలు నిర్వహించాలి. వాటిలో వ్యాస రచన, వక్తృత్వ, కవితా రచన, కథా రచన, నాటకాలు లాంటి ప్రక్రియలుండాలి
- మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని అలంకరించాలి. ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ద్వారాలు ఏర్పాటు చేయాలి. జిల్లాల్లో కూడా అలంకరణలు ఉండాలి. రాష్ట్రమంతా పండుగ వాతావరణ నెలకొనాలి
- ప్రారంభ, ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను ఆహ్వానించాలి
Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao has decided to organise World Telugu Conference here for five days from Dec 15 to 19. He has instructed that the preparatory programmes should start forthwith. The government earlier decided to organise the World Telugu Conference in October. However, a World Tourism Conference is going to take place from October 5 to 9, in which representatives from 90 countries are participating. Moreover, Global Entrepreneurship Forum in which representatives from 170 countries are participating is also being held in Hyderabad from Nov 28. The entire official machinery is totally busy with these two prestigious conferences. Hence it was decided to organise the World Telugu Conference in the month of December after the completion of the two World Conferences and this decision was taken at a high-level meeting held here on Tuesday at Pragathi Bhavan. The CM has announced the sanction of Rs. 50 Crore for organising the World Telugu Conference. Rs. 5 Crore is given to Telangana Sahitya Academy and Rs. 2 Crore to the Official Language Commission organising expenses. The Telangana Sahitya Academy will be the nodal agency for the World Telugu Conference.
Government’s Chief Advisor Sri Rajiv Sharma, Advisor Sri KV. Ramanachary, Sahitya Academy Chairman Sri Nandini Siddha Reddy, Official Language Commission Chairman Sri Devulapalli Prabhakar Rao, Grandhalaya Parishad Chairman Sri Ayachitam Sridhar, Cultural Affairs Director Sri Mamidi Harikrishna, Telugu University VC. Sri Satyanarayana, Telangana State Government’s Representative in New Delhi Sri S. Venugopalachary and others participated in the meeting.
On the occasion of organising the first ever World Telugu Conference in the State, the CM has announced two important decisions for the protection and perseverance of the Telugu language and literature.
1. The CM has instructed all the educational institutions in the State both private and public to teach Telugu as a Compulsory subject from 1st to 12th standard. He has made it clear that it is only the educational institutions that are teaching Telugu, as a compulsory subject will be given recognition and permissions to function. For those opting for Urdu, it should be offered as an optional. The CM has asked the Sahitya Academy to prepare syllabus for the Telugu subject to be taught to primary, secondary and higher and intermediate classes. The syllabus should be framed and textbooks should be printed at the earliest. The Syllabus fixed by the Sahitya Academy will be taught in all the educational institutions and they are not expected to print textbooks and teach syllabus according to their whims and fancies. The government will be strict in implementing the policy that Telugu is taught as the compulsory subject and only the syllabus framed by the Sahitya Academy is taught, the CM declared.
2. All the Public and Private establishments and institutions in the Telangana state should display their organisations names in Telugu on their signboards. It is upto them to write their firm’s names in other languages too. The CM has decided to pass resolutions on these two issues at the State cabinet meeting.
Other decisions taken at the high level meeting are as follows:
Conferences, discussions will be organised at the World Telugu Conference (WTC) how the Telugu language is preserved, protected, enriched in the Telangana region. Programmes should be conducted in such a manner that the Telugu that blossomed in the Telangana region should be known to all corners of the World. The literature that had emerged from Golconda should be known to the people. The proposed WTC will have programmes on several genres of the Telugu language and literature.
WTC will be held in LB Stadium as the Main Venue. Ravindra Bharathi, Indira Priyadarshini Auditorium, Lalitha Kala Thoranam, Nizam College Grounds, Bharatiya Vidya Bhavan, Pingle Venktramreddy Hall, Silpa Kala Vedika will host the other programmes.
Literary events will be held during the day and in the evenings there will be cultural programmes. Dance by Gonds, Kolatam, Perini performances, songs like Kalupu, Naatu and Bathukamma, entertainment programmes will be the part of the cultural programmes. The relationship between Tanishah and Ramadasu, Ramadasu Padakeerthanalu, Thandanana Ramayanam, Saradakars, Harikatha recital will also be performed. Arrange for the recitation of poems, film light music programmes Cine Vibhavari. The folk songs of the rural region which people sing from dawn break to the dusk should be organised at the programmes.
Organise for the performance of Classical, Tribal and other theatre forms. Showcase how the songs especially sung by women have been handed over from generation to generation. Invitations will be given to scholars, linguists, literary figures, language exponents, writers, artists, and artistes from all over the world, in the country for the conference on behalf of the conference.
Preparatory meetings will be held to invite guests from India and abroad and to explain to them the importance of the WTC. Preparatory meetings will also be held in the US, Europe, the Gulf, Mauritius, Singapore, and Malaysia. Meetings will also be held in Andhra Pradesh and other States where they are Telugu population as well as in all the major towns and cities in the Telangana State.
Not only Telugu but also eminent writers from other languages who won Sahitya Academy and Jnana Peeth Awards will also be invited for the WTC. Essay writing competition will be held on the various generes of Telugu in Telangana for the school students. Felicitations will also be given to eminent Telugu poets, writers, novelists, literary figures, scholars, artists, artistes etc., Food, accommodation, travel for the guests will be provided by the Organisers.
The CM wanted that all the books on the development of Telugu language and literature should be printed before the commencement of the conference. Guests should take around for the City tour. An exclusive documentary Telangana darshini should be made to introduce Telangana for the guests. Bathukamma’s background, which showcases the wonderful Telangana culture and its intra human relationships should be held. Construct Dr. C. Narayan Reddy memorial in the city. Select the place in two or three days and start the work. Sahitya Academy will act as the Nodal Agency. Official Language Commission, Telugu University, Cultural Affairs department, Grandhalaya Parishad will play a key role. Conduct essay writing, elocution, short story writing, writing of poetry competitions in the educational institutions. Decorate Hyderabad city on the occasion, put up cut outs, banners, arches and entrances at the important junctions. Decorate towns and cities too. There should be a festive atmosphere all over the State, the CM advised.
Invite the President, the Prime Minister and Vice President for the inaugural and valedictory meetings.
-டாக்டர்.துரைபெஞ்சமின்.
ullatchithagaval@gmail.com